Category రాజకీయాలు

రామ్ గోపాల్ వర్మపై కేసు విచారణలో కొత్త మలుపులు

టాలీవుడ్‌ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ఇటీవల నమోదైన పోలీసు కేసు విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన పోస్టుల నేపథ్యంలో మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు వర్మపై ఈనెల 10న…

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పంచాయతీ బిల్లులు: పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశంలో పంచాయతీరాజ్‌ బిల్లును ప్రవేశపెట్టిన ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, డంపింగ్‌ యార్డ్‌ సమస్య ప్రధానంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మండలాల యూనిట్లుగా డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.…

నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది: బాలీవుడ్ చిత్రంపై ప్రధాని మోదీ ట్వీట్

పొలిటికల్ డ్రామా నేపథ్యంతో రూపొందించిన బాలీవుడ్ చిత్రం ది సబర్మతి రిపోర్ట్ తాజా సంచలనంగా మారింది. విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ది డోగ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్మ దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్ నిర్మించారు. 2002లో జరిగిన గోద్రా రైలు ఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు.…

ap schools

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల సమయాల పొడిగింపు: పైలట్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల సమయాలను పొడిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే నిర్ణయం తీసుకోగా, ఈ మార్పును ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్ రూపంలో అమలు చేయనుంది. ప్రతి మండలంలో రెండు పాఠశాలలను ఎంపిక…

cbn

ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటనతో కీలక చర్చలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు వేగవంతం చేయడం కోసం పలువురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై సమాలోచనలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.…

mudragada

సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ఏపీ సీఎం చంద్రబాబుపై ముద్రగడ ఫైర్

చాలా రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన లేఖ అస్త్రాలు మళ్లీ మొదలెత్తారు, ఈరోజు ముఖ్యమంత్రికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని ఆయన…

ts govt

 తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచనలు జారీ చేశారు. ప్రజా పాలన విజయోత్సవాలకు “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవం” అనే…

kutami govt

ఏపీ ప్రజలకు శుభవార్త: కొత్త పెన్షన్‌ దరఖాస్తులపైకూటమి ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. కొత్త పెన్షన్‌దారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి డిసెంబర్‌ మొదటి వారం నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సామాజిక సంక్షేమ…

rrr post

రఘురామకృష్ణరాజు: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక!

రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే కూటమి పక్షం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కూటమి నేతలతో చర్చించి రఘురామకృష్ణరాజును పేరును ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి…

ap assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: మూడు కీలక సవరణ బిల్లులు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024-25 ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలలో ముఖ్యంగా మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో ఒకటి పంచాయితీ రాజ్ సవరణ బిల్లు – 2024, ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. రెండోది మున్సిపల్ సవరణ బిల్లు – 2024, ఇది మంత్రి నారాయణ్ ప్రవేశపెట్టనున్నారు.…