అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులకు కానుక గా, తను నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ మేకర్స్ ముందుకు వచ్చారు.
ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి అక్టోబర్ 21న కొత్త పోస్టర్ ను ఆ చిత్ర బృందం విడుదల చేశారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ తన పాత డార్లింగ్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ తో పాటు అక్టోబర్ 23న మరిన్ని అప్డేట్స్ ఉంటాయని ఆ చిత్రం బృందం తెలిపింది.
ప్రభాస్ అభిమానులు ఈ పోస్టర్ ను చూసి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అక్టోబర్ 23న ఉండబోయే అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మాళవిక మోహన్, నిధి అగర్వాల్,సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జీ. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.