తెలంగాణ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అక్టోబర్ 11న, రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో నిర్మించబడనున్న 18 పాఠశాలలకు ఒకేసారి శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు గ్రామంలో భూమి పూజ చేయగా, ఉపముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా మధురలో భూమి పూజ నిర్వహించారు.

ఈ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతేకాక, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ పాఠశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, పర్యావరణానికి అనుకూలంగా సోలార్ ప్యానల్స్ వాడబోతున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు దసరా కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పారు.

పాఠశాల నమూన:

ఈ పాఠశాలల ప్రత్యేకతలు:

ప్రతి పాఠశాల 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.

వర్షపు నీటి సంరక్షణ మరియు సోలార్ ఎనర్జీ సదుపాయాలు ఉంటాయి.

ప్రతి పాఠశాలలో 120 మంది సిబ్బంది ఉండగా, 2,560 మంది విద్యార్థులు విద్యనభ్యసించవచ్చు.

డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉంటాయి.క్రికెట్ మైదానం, ఫుట్‌బాల్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.

బోధన విధానం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ఈ పాఠశాలల నిర్మాణంతో తెలంగాణలో విద్యా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని, విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి