అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన నోబెల్ బహుమతుల గ్రహీతలను స్వీడన్ లోని నోబెల్ బృందం ప్రకటించింది. ఇప్పటికే వివిధ రంగాలలో బహుమతులు గ్రహీతలను ప్రకటించారు. తాజాగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతుల గ్రహీతలను ప్రకటించింది నోబెల్ బృందం.

ఈ సంవత్సరం అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురికి దక్కింది. డారన్ అసెమొగ్లూ, సైమన్ జాన్సన్ మరియు జేమ్స్ ఏ. రాబిన్సన్ ఈ అవార్డుకు ఎంపికైనట్లు రాయల్ స్పీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన అధ్యయనానికి ఈ పురస్కారం లభించినట్లు తెలిపింది. వీరి పరిశోధనలో సంస్థలు మరియు వాటి విధానాలు దేశ సంపన్నతపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ పరిశోధన దేశాల మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రం వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు అందజేస్తారు.నోబెల్ బహుమతులు మానవాళికి అత్యంత ప్రయోజనం చేకూర్చటానికి కృషి చేసిన వారికి ఇవ్వబడతాయి. ఈ బహుమతులు 1895లో స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొన్న విధంగా 1901లో ప్రారంభమయ్యాయి.

ఈ నోబెల్ బహుమతులను ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తారీఖున, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున అందజేస్తారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి