హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్ కళ్యాణ్ కు సమన్లు జారీ

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలి ఆదేశించింది.పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపి నోటీసులు జారీ చేశారు.

తిరుమల లడ్డు వివాదంతో పాటు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థ పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ మరియు వార్డ్ వాలంటీర్లు మానవ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నుండి ఈ సమన్లపై అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఆయన తరపు న్యాయవాదులు ఈ కేసును ఎలా పరిష్కరించాలని దానిపై విచారణ జరుగుతున్నట్టు సమాచారం ఉంది.ఇతర రాజకీయ నాయకులు నుండి కూడా ఎటువంటి స్పందన లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఇతరుల నుంచి కూడా స్పందన వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి