టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఈవెంట్ లో ఆయన క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ పై కౌంటర్లు వేయడం ద్వారా వైరల్ అయ్యారు. “మీకే చెప్తున్నా. మీరు నన్ను ఏమి పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా, నా సినిమాను ప్రమోట్ చేస్తాను. నేను ఏం తప్పు చేయట్లేదు. నా సినిమాకు సంబంధించి క్రిటిక్స్, రివ్యూయర్స్ ఏం రాసినా, వారు వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, కానీ పర్సనల్ లెవల్లో ఎటాక్ చేయడం వద్దంటాను” అని విశ్వక్ సేన్ చెప్పారు.
విశ్వక్ సేన్ పై గతంలో ట్రోల్స్ జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. “ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు, కానీ బాధ్యతగా రాయండి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని” అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ‘మెకానిక్ రాకీ’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పుడు ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం పొందాయి.