విజయ్ దేవరకొండ, రాధిక మదన్ జంటగా ‘సాహిబా’ మ్యూజిక్ వీడియో విడుదలకు సిద్ధం!

“హీరియే” పాటతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ మరియు సింగర్ జస్లీన్ రాయల్, ఇప్పుడు తన కొత్త సాంగ్ “సాహిబా”తో మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించినా, ఇప్పుడు “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్‌లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ జోడీగా బాలీవుడ్ అద్భుత నటి రాధిక మదన్ నటిస్తున్నారు. వీరు మొదటి సారి స్క్రీన్ పై కలిసి నటించనున్నారు.

“సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. జస్లీన్ రాయల్ ఈ పాటను తన సరికొత్త సంగీత శైలితో రూపొందించి, శ్రోతల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ పాట యొక్క భావోద్వేగాల మూలంగా, ఇది చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో నిలిచిపోతుంది. ఈ రోజు, మేకర్స్ పాట యొక్క ప్రోమోను విడుదల చేశారు, ఇందులో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా కనిపించనున్నారు. విజయ్, రాధిక మదాన్ వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉంది.

“సాహిబా” పాట యొక్క పూర్తి మ్యూజిక్ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరియు సంగీత ప్రియులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ పాట ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

“సాహిబా” పాట తన సంగీతంతోనే కాదు, విజయ్ మరియు రాధిక మధ్య ఉన్న కెమిస్ట్రీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి