తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్న సినిమా పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే పుష్ప 2 రికార్డులను తిరగరాస్తూ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టిస్తోంది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో పుష్ప చెప్పిన “పుష్ప అంటే మామూలు ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్” అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ డైలాగ్ చెప్పినట్లే, పుష్ప 2 సృష్టిస్తున్న రికార్డులు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరుస్తున్నాయి. అమెరికన్ బాక్సాఫీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్ చేరుకున్న తొలి తెలుగు సినిమాగా పుష్ప 2 నిలిచింది. అమెరికాలో ఈ సినిమాను ప్రదర్శించడానికి ఇప్పటికే 3000కి పైగా షోలను ప్లాన్ చేశారు, విడుదల తేదీ దగ్గరవడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ స్థాయి ఆదరణ సొంతం చేసుకోవడంతో్ ఈ విషయం చిత్రయూనిట్ “మరో రోజు.. మరో రికార్డు” అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫ్యాన్స్ మధ్య ఉత్సాహాన్ని మరింత పెంచే ఈ వార్త పుష్ప మేనియా ఏ రేంజ్ లో ఉందో తెలియచేస్తుంది.
మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించి, పుష్పరాజ్ ఎదుగుదల, ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో కొత్త ఘట్టాలను చూపించబోతున్నారు. మేకర్స్ మాటల ప్రకారం, ఈ రెండో భాగం మొదటి భాగాన్ని మించి ఉంటుందని, అభిమానులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుంది అని తెలుస్తుంది.