లోకేష్ కానుగారాజ్‌ సర్‌ప్రైజ్‌: ఖైదీ 2  కంటే ముందు ఇదే

దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కోలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌, ఖైదీ సినిమాతో తను క్రియేట్ చేసిన సెన్సేషన్, ప్రేక్షకులని తనవైపు ఆకర్షించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత, ఈ చిత్రానికి సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఖైదీ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్తీ అభిమానులకు ఇది మంచి వార్తే. కానీ, ఖైదీ 2 కంటే ముందు ఫ్యాన్స్‌కు మరో పెద్ద సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశాడు లోకేష్‌.

ఈ సర్‌ప్రైజ్‌ ఏమిటంటే, ఖైదీ, విక్రమ్‌, లియో మూవీస్‌లోని క్యారెక్టర్స్‌ మధ్య సంబంధం, వాటి టైమ్‌లైన్స్ గురించి క్లారిటీ ఇవ్వడం కోసం, లోకేష్ ఒక 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింను రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ఎల్‌సీయూ (లోకేష్‌ సినమాటిక్‌ యూనివర్స్‌) గురించి మరింత స్పష్టత ఇవ్వబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఖైదీ 2, లియో చిత్రాల మధ్య ఉండే సంబంధాల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌సీయూ కనెక్షన్స్‌పై అభిమానుల అంచనాలకు తగిన క్లారిటీ ఇవ్వాలని లోకేష్‌ భావించారు.

లోకేష్‌ తన చిత్రాలన్నింటినీ ఒకరినొకరు క్రమపద్ధతిలో కనెక్ట్ చేస్తూ, వాటి మధ్య సమీకరణాలను వాస్తవికంగా చూపించడం తన ప్రత్యేకతగా నిలిచింది. ఇప్పుడు ఖైదీ 2 విడుదలకు ముందే ఈ క్యారెక్టర్స్‌ ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతున్నాయో ఈ షార్ట్ ఫిలింలో చూపించనున్నారు. ఇంతకాలం అభిమానులు తమ లెక్కలతో 2019లో జరిగిన సంఘటనలు, వాటి మధ్య సమానతలు గురించి ఆలోచనలు చేస్తూ వచ్చారు. కానీ, నిజంగా ఏం జరుగుతుందో తెలియజేసే బాధ్యతను తన మీద వేసుకున్నారు లోకేష్‌.

విక్రమ్‌ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్‌ క్యారెక్టర్‌కి వచ్చిన భారీ స్పందన తర్వాత, ఈ పాత్ర కూడా ఢిల్లీ, విక్రమ్‌ క్యారెక్టర్స్‌కి ప్యారలల్‌గా ట్రావెల్ అవుతుందని అభిమానులు భావించారు. లియో స్టోరీ 2021లో జరిగినప్పటికీ, ఈ మూడు సినిమాలు ఒకే టైమ్‌ఫ్రేమ్‌లో కొనసాగుతున్నాయా అని చాలా అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలకు సమాధానం ఈ షార్ట్ ఫిలింలో దొరకబోతుందని ఇపుడు సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఈ షార్ట్ ఫిలింలో లోకేష్ ఏం చెప్పబోతున్నాడు? ఖైదీ 2 ముందు అభిమానుల అంచనాలను నిజం చేయడానికి అతను ఏం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడో తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి