పీరియాడిక్ యాక్షన్, మోడరన్ హీరో: ‘కంగువ’ రీలీజ్ ట్రైలర్ లో ఏముంది?

తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ సినిమా, అతని కెరీర్ లోని ప్రెస్టీజియస్ మూవీల్లో ఒకటి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్, భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి రాబోతున్నది.

సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకుల లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్ లో రెండు కాలాలను లింక్ చేస్తూ, ఒకవైపు వెయ్యేళ్ల క్రితం ఉన్న కంగువ పాత్రను, మరోవైపు నేటి కాలంలో ఉన్న స్టైలిష్ హీరో పాత్రను చూపించారు. వెయ్యేళ్ల క్రితం కంగువ చేసిన ప్రామిస్, ఈ నేటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడనే ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్ సాగింది. ఈ సినిమా లింక్ చేసే పీరియాడిక్ కథతో పాటు, ప్రస్తుత కాలంలో ఉన్న యాక్షన్ సీన్స్ కూడా చూపించబడ్డాయి.

‘కంగువ’ ట్రైలర్ లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘ధీర ధీర కదన విహార’ పాట బీజీఎం, సినిమాకి ఇంటెన్సిటీని పెంచి, ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. పీరియాడిక్ యాక్షన్ తో కూడిన ఈ సినిమా, ఒక వీరుడి ప్రతిజ్ఞ, మోసాలు, గౌరవం నిలబెట్టడం వంటి అంశాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ నెల 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి