టీమిండియా అద్భుత ప్రదర్శన: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలుపు!

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీమిండియా విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది సంజూ శాంసన్ టీ20లో సాధించిన మూడో సెంచరీ. మరోవైపు, తిలక్ వర్మ 120 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా రెండో సెంచరీ సాధించిన తిలక్ వర్మ, టీ20లో ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మొదట ఆటగాడు సంజూ శాంసన్ కావడం విశేషం, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలో 36 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు శుభారంభం ఇచ్చాడు.

బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టాడు. అక్షర్ పటేల్ 2 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి జట్టుకు కీలక సహకారం అందించాడు.

దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా విజయంలో బ్యాట్స్‌మెన్ మరియు బౌలర్ల సమష్టి ప్రదర్శన ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు దిగ్గజాలు రిటైర్ అయ్యాక భారత్ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా చూశారు, ఈ విజయంతో భారత జట్టు తన సమర్థతను నిరూపించుకుంది, ఈ సిరీస్ లో అదుభూతమైన ఆట తీరు ప్రదర్శించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి