భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఈ రోజు సెంచూరియన్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది, కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది. ఇరు జట్లూ సిరీస్‌ను ఆధిక్యం సాధించేందుకు ఈ మ్యాచ్‌ను గెలవాలని పట్టుదలగా ఉన్నారు.
సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిషేక్ శర్మ రెండు మ్యాచులలో సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యాడు. సెంచూరియన్‌లో అయినా బ్యాట్ ఝళిపిస్తాడేమో చూడాలి.
సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఇంకా వారి పూర్తి సామర్థ్యంతో ఆడడం లేదు. ఈ ఇద్దరూ త్వరగా రాణించాలి. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో మరింత మెరుగుదల అవసరం. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ జట్టు కోసం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.
ఇంకా, దక్షిణాఫ్రికా జట్టు కీలక మ్యాచ్ కోసం పూర్తిగా సిద్ధమైంది. వారు ముఖ్యంగా తమ బ్యాటింగ్‌ను మెరుగుపరచాలని భావిస్తున్నారు, ప్రత్యేకించి మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్ లాంటి ఆటగాళ్ల మీదే ఆధారపడి ఉంది. అయితే, సఫారీ బౌలింగ్ మాత్రం పటిష్టంగా ఉందని చెప్పవచ్చు.
భారత జట్టు: (అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ లేదా రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ లేదా యశ్ దయాల్.
దక్షిణాఫ్రికా జట్టు: (అంచనా)
మార్‌క్రమ్ (కెప్టెన్), రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రుగర్, జాన్సెన్, సిమెలానె, కొయెట్జి, కేశవ్, పీటర్.
ఈ మ్యాచ్‌ను బుధవారం రాత్రి 8:30 గంటలకు స్పోర్ట్స్ 18, జియో సినిమా ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.