హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ!

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు మార్గం సుగమమైంది. నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు దీనికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. దాదాపు రూ. 24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంలో భాగస్వామ్యం కానున్నాయి. ప్రస్తుత మెట్రో సేవలను విస్తరించి నగరంలోని ముఖ్య ప్రాంతాలను మెట్రోతో కలుపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం నగరంలో 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో విజయవంతంగా నడుస్తోంది. రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తున్న ఈ మెట్రో, రెండో దశ పూర్తయితే మరిన్ని మార్గాల్లో విస్తరించి, రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు ఏర్పాటు చేయనున్నారు.

మెట్రో రైల్ రెండో దశ కారిడార్లురెండో దశలో కొత్తగా

ఐదు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో:

1. కారిడార్ 4: నాగోలు – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (36.8 కి.మీ)

2. కారిడార్ 5: రాయదుర్గ – కోకాపేట్ (11.6 కి.మీ)

3. కారిడార్ 6: ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)

4. కారిడార్ 7: మియాపూర్ – పటాన్‌చెరు (13.4 కి.మీ)

5. కారిడార్ 8: ఎల్బీనగర్ – హయత్‌నగర్ (7.1 కి.మీ)

ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 24,269 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం 30% అంటే రూ. 7,313 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 18% అంటే రూ. 4,230 కోట్లు వెచ్చించనుంది. మిగిలిన 52% నిధులను రుణాలతోపాటు పీపీపీ విధానంలో సమకూర్చనున్నారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్ నగరాన్ని మెట్రో సేవలలో మరింత ముందుకు తీసుకెళ్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి