హీరో విజయ్ దేవరకొండకు గాయాలు: అసలు ఏమి జరిగింది?

హీరో విజయ్ దేవరకొండ ఇటీవల యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడినట్లు సమాచారం. అతను స్వల్పంగా గాయపడటంతో, మూవీ టీమ్ వెంటనే హాస్పటల్‌కు తరలించింది. ఫిజియోథెరపీ అనంతరం విజయ్ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు, దీంతో మొదట అభిమానాలు కంగరుపాడారు తరవాత చిన్న గాయమే అని తెలియడంతో అభిమానులు ఊపిరి పిల్చుకునరు.

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల ద్వారా ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. అయితే, గీతగోవిందం తర్వాత అతనికి సరిన హిట్ లేదు ఆయన చేసిన ఇతర సినిమాలు ప్రేక్షకులను మెపించలేకపోయాయి. ప్రస్తుతం, విజయ్ జెర్సీ చిత్రం ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐతే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన భుజానికి గాయం అవ్వడంతో, వెంటనే హాస్పటల్‌కు తీసుకెళ్లారు. కానీ, గాయమైనప్పటికీ, విజయ్ దేవరకొండ తన దర్శక నిర్మాతల కోసం షూటింగ్‌కు హాజరయ్యాడు. విజయ్ లాంటి హీరోలు గాయాలుతో ఉన్నా కూడా నిర్మాత గురించి ఆలోచించడం నిజంగా గొప్ప విషయం.

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో తన  స్టైల్  మార్చినట్లుగా కనిపిస్తున్నాడు, కథలో పోలీస్, మాఫియా అంశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీలంక, కొచ్చి వంటి ప్రదేశాల్లో షూట్ చేస్తున్నారు. విజయ్ అనంతరం రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా వంటి దర్శకులతో ప్రాజెక్టులు చేయనున్నాడు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి