గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ సూపర్ హిట్ కావడంతో సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.
తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సింగిల్ మెలోడీ పాట రానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. ఈ పాట ప్రేక్షకులను కొత్త అనుభూతిలో ముంచెత్తుతుందని, వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 22న, ప్రోమో నవంబర్ 25న, పూర్తి పాట నవంబర్ 27న విడుదల కానుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్‌లో మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం.
వెరైటీ కథా కథనాలతో ప్రేక్షకులను మెప్పించే శంకర్ ఈ చిత్రాన్ని తనకు మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచేలా రూపొందిస్తున్నారు.,వరుస అప్‌డేట్స్‌తో ‘గేమ్ ఛేంజర్’ పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి మెగా అభిమానులకు పెద్ద పండగగా మారనుంది.