ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 13, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఒక సంవత్సర కాలం పాటు పని చేయాల్సి ఉంటుంది.
భర్తీ చేయబోయే పోస్టుల్లో ముఖ్యమైనవి జీఐఎస్ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్, జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్, జెండర్/జీబీవీ స్పెషలిస్ట్, సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్, జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
- జీఐఎస్ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్: 6 పోస్టులు
- ప్లానింగ్ అసిస్టెంట్: 2 పోస్టులు
- సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 1 పోస్టు
- జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్: 3 పోస్టులు
- జెండర్/జీబీవీ స్పెషలిస్ట్: 1 పోస్టు
- సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్: 2 పోస్టులు
- జూనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషలిస్ట్: 4 పోస్టులు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఆర్క్, బీటెక్/ బీఈ, ఎంఈ/ ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే, పోస్టులను బట్టి 2 నుండి 10 సంవత్సరాల పని అనుభవం అవసరం. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు, కేవలం విద్యార్హతలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తూ, ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, అమరావతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు 9493974520 నెంబర్‌కు సంప్రదించవచ్చు లేదా recruitment@apcrda.org కు మెయిల్ చేయవచ్చు.