అల్లరి నరేష్ ఇటీవల కథా నేపథ్యంతో ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేసిన ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నరేష్, ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని నమోదు చేశాడు. అదే దర్శకుడితో చేసిన ‘ఉగ్రం’ యావరేజ్‌గా నిలిచినా, నరేష్ కంటెంట్ సెలెక్షన్‌కి ప్రశంసలు దక్కాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ డిజాస్టర్‌గా మారింది.
ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో నరేష్ బలమైన కథతో రూపొందుతున్న ‘బచ్చల మల్లి’ అనే సినిమాను ఎంచుకున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను సృష్టించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ చిత్రం మున్ముందు థియేట్రికల్ రైట్స్‌కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆంధ్ర రైట్స్‌ను రూ.3.25 రేషియోకు విక్రయించారని, ఇది నరేష్ కెరీర్‌లో హయ్యెస్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన బ్యానర్ కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
డిసెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానున్న ‘బచ్చల మల్లి’ సినిమా కథా బలంతో థియేటర్ రెవెన్యూ రాబట్టడంలో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. అల్లరి నరేష్ ఈ సారి మరో హిట్‌ను అందుకోవాలని ఆశిస్తున్నారు.