భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20  సిరీస్: భారత్ జట్టు ఇదే

భారత్ క్రికెట్ జట్టు నవంబర్ 8 నుండి 15 వరకు దక్షిణాఫ్రికా గడ్డపై నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌లు డర్బన్, గిక్బర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నగరాల్లో జరగనున్నాయి. మ్యాచ్‌లు రాత్రి 9:30కి ప్రారంభమవుతుండగా, టాస్‌ రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ సిరీస్‌ను ఆన్‌లైన్‌లో జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చు.

సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ వంటి ముఖ్య ఆటగాళ్లు ఉన్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మ ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, వైశాఖ్ విజయకుమార్, యష్ దయాల్ కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ సిరీస్‌కి గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్నాడు. గంభీర్ టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళనుండడంతో టీ20 సిరీస్ బాధ్యతలు లక్ష్మణ్ తీసుకున్నారు.భారత జట్టు నవంబర్ 3న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది.

దక్షిణాఫ్రికా గడ్డపైకి వెళ్లే భారత టీ20 జట్టు:

  • సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
  • అభిషేక్ శర్మ
  • సంజూ శాంసన్ (వికెట్ కీపర్)
  • రింకు సింగ్
  • తిలక్ వర్మ
  • హార్దిక్ పాండ్యా
  • అక్షర్ పటేల్
  • వరుణ్ చక్రవర్తి
  • రవి బిష్ణోయ్
  • అర్షదీప్ సింగ్
  • విజయ్ కుమార్ వైశక్
  • అవేష్ ఖాన్
  • యష్ దయాల్
  • జితేష్ శర్మ (వికెట్ కీపర్)
  • రమణ్‌దీప్ సింగ్

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి