గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మీద అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR తర్వాత మళ్లీ చరణ్ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్నది గేమ్ ఛేంజర్. మరి అదే స్థాయిలో సక్సెస్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
డైరెక్టర్ శంకర్ “ఒకే ఒక్కడు” తర్వాత మళ్లీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న సినిమా ఇదే కావడం మరో విశేషం. కియారా అద్వాణి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌జే సూర్యా, అంజలి, శ్రీకాంత్ వంటి ప్రముఖులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా క్రిస్మస్‌కి విడుదల అవుతుందని ముందుగా ప్రకటించారు, కానీ డిస్ట్రిబ్యూటర్లు మరియు అభిమానులు సంక్రాంతి విడుదలకు పట్టు పట్టారు. అందుకే, నిర్మాత దిల్ రాజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.
ఇక, దీపావళి సందర్బంగా ఈ నెల 31న గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల కానుంది, దాంతో అభిమానులలో ఉత్సాహం మరింత పెరిగింది.