మెకానిక్ రాకీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా?

యువ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం మెకానిక్ రాకీ నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రామ్ తాళ్లూరి తన ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అందంగా తీసిన విజువల్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ సినిమా ప్రమోషన్లు మెల్లగా మొదలైనప్పటికీ, విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ వేగం పెంచింది. నవంబర్ 17న సాయంత్రం 5 గంటల నుంచి వరంగల్‌లోని జెఎన్ఎస్‌డబ్ల్యూ ఇండోర్ స్టేడియం‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, విశ్వక్ సేన్ ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని తీమగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి తోడు యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. మెకానిక్ రాకీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి