వీర సింహారెడ్డి వంటి భారీ హిట్ తరువాత, నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రమైన డాకు మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ చిత్రానికి అనేక టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరికి ‘డాకు మహారాజ్’ అనే పేరును ఫిక్స్ చేశారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న టీజర్ విడుదల చేయగా, అది సూపర్ రెస్పాన్స్‌ను పొందింది. బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణతో పలు సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అఖండ సినిమాలో తమన్ వేసిన మ్యాజిక్ మళ్లీ ‘డాకు మహారాజ్’లో కూడా రిపీట్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.