ఏపీ ప్రజలకు శుభవార్త: కొత్త పెన్షన్‌ దరఖాస్తులపైకూటమి ప్రభుత్వం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. కొత్త పెన్షన్‌దారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి డిసెంబర్‌ మొదటి వారం నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సామాజిక సంక్షేమ పథకాలకోసం కీలక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం కింద పెన్షన్‌ మొత్తాన్ని రూ. 4,000కి పెంచింది. ఈ పెంపు ఎన్నికల హామీల్లో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది, 2024 ఏప్రిల్‌ నుంచి పెన్షన్‌ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64,14,174 మంది పెన్షన్‌దారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు వంటి 26 రకాల అర్హత కలిగిన వ్యక్తులకు ఈ పథకం అమలులో ఉంది.

ప్రస్తుతం కొత్తగా పెన్షన్‌ కోసం చాలా మంది అర్హులైన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి నేపథ్యంలో తాజాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కీలక ప్రకటన చేశారు.  అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్‌ మొదటి వారం నుండి దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. గ్రామ సచివాలయాలు లేదా వార్డ్‌ సచివాలయాల ద్వారా వారు ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ముఖ్యంగా, పెన్షన్‌దారులు గ్రామంలో లేకుండా కొన్ని నెలలు గడిచినా, వారికి పెన్షన్‌ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నకిలీ ధృవపత్రాలతో అనర్హులు పెన్షన్‌ పొందుతున్నట్లు గుర్తిస్తే, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అలాగే, పెన్షన్‌దారులకు సంబంధించి ఎలాంటి అవినీతి, అక్రమాలు  జరిగిన, వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ మరోసారి స్పష్టీకరించారు. ప్రభుత్వం సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడంలో కట్టుబడి ఉందని, అన్ని అర్హులకూ న్యాయమైన విధంగా పెన్షన్‌లు అందించేలా తాము కృషి చేస్తామన్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి