ఆంధ్రప్రదేశ్ 2024-25 వార్షిక బడ్జెట్ 2.94 లక్షల కోట్లు: దేనికి ఎంత కేటాయించారు?

2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 2.94 లక్షల కోట్లతో రూపొందించబడింది. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుదేలైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి తన ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, ముఖ్యమైన ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా పెంచారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.

బడ్జెట్‌లో ముఖ్యమైన కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి:

  • ఆరోగ్యం: ₹18,421 కోట్లు
  • ఉన్నత విద్య: ₹2,326 కోట్లు
  • పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: ₹16,739 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధి: ₹11,490 కోట్లు
  • గృహనిర్మాణం: ₹4,012 కోట్లు
  • జలవనరులు: ₹16,705 కోట్లు
  • పరిశ్రమలు & వాణిజ్యం: ₹3,127 కోట్లు
  • ఇంధన శాఖ: ₹8,207 కోట్లు
  • పాఠశాల విద్య: ₹29,909 కోట్లు
  • బీసీ సంక్షేమం: ₹39,007 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం: ₹18,497 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం: ₹7,557 కోట్లు
  • మహిళా సంక్షేమం: ₹4,285 కోట్లు
  • స్కిల్ డెవలప్‌మెంట్: ₹1,215 కోట్లు
  • పర్యావరణం, అటవీ శాఖ: ₹687 కోట్లు

ఈ బడ్జెట్‌లో ముఖ్యమైన చట్టాల గురించి కూడా ప్రస్తావించారు. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం, జ్యుడీషియల్ కమిషన్ రద్దు, జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపు వంటి చట్టాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయడం జరిగింది.

ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కీలకమైన అడుగులు వేయబడ్డాయి అని ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి